గంటల వ్యవధిలో మిస్సింగ్ కేసు చేధించిన విజయవాడ పోలీసులు

50చూసినవారు
గంటల వ్యవధిలో మిస్సింగ్ కేసు చేధించిన విజయవాడ పోలీసులు
నూజివీడు మండలం గొడుగు వారి గూడెంకు చెందిన జోష్ మేరి ఆమె కుమార్తెను డెలివరీ నిమిత్తం పాత గవర్నమెంట్ హాస్పిటల్ కు తీసుకువచ్చారు. ఈ క్రమంలో వారితో కుమారుడు సుబ్రహ్మణ్యం మానసిక పరిస్థితి బాగోలేక ఆదివారం రాత్రి  తప్పిపోగా, వారు సోమవారం గవర్నరుపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. రెండు బృందాలుగా ఏర్పడి పోలీసులు సీసీ ఫుటేజి పరిశీలించారు. వై జంక్షన్ రోడ్డు పక్కన ఉన్నట్లు గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు.

సంబంధిత పోస్ట్