బాల్య వివాహాలు, సతీ సహగమనానికి వ్యతిరేకంగా పోరాటం చేసిన సావిత్రి బాయి పూలే, అట్టడుగు వర్గాలు, మహిళల విద్య కోసం చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని మంత్రి ఎస్. సవిత తెలిపారు. శుక్రవారం సావిత్రిబాయి పూలే జయత్యోంత్సవం సందర్భంగా తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి ఘన నివాళులర్పించారు.