ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు విశాఖ డైరీ అవినీతి, అక్రమాలపై విచారణ కోసం ప్రత్యేక హౌస్ కమిటీని నియమించారు. నవంబర్ 20న శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించడంతో ఈ కమిటీ ఏర్పాటుకు అడుగు పడినట్లు స్పీకర్ తెలిపారు. విజయవాడ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రెండు నెలల లోపు విచారణ పూర్తి చేసి నివేదికను సమర్పించాల్సిందిగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఆదేశించారు.