విజయవాడలోని ఆటో నగర్లో ఓ టీవీ ఛానల్ కార్యాలయం ఎదుట టీడీపీ మహిళా కార్యకర్తలు సోమవారం ఆందోళనకు దిగారు. డౌన్ డౌన్, అబద్ధాల ప్రచారం చేసే ఛానల్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్, కృష్ణ రాజుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఛానల్ కార్యాలయం గేటు పైకెక్కి ఛానల్ బోర్డును తొలగించి చెప్పులతో కొట్టారు.