ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలకు నిరసనగా మంగళవారం, విజయవాడలో వైసీపీ మహిళా విభాగం నిరసన తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలు, చిన్నారులపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు. నిరసనలో వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షులు వరుదు కళ్యాణి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా మహిళ అధ్యక్షులు విజిత, నగర మేయర్ భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు, మహిళ కార్యకర్తలు పాల్గొన్నారు.