ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలతో సంబంధం లేని విద్యావేత్తలను వ్యాపారస్తులను కాపాడండి అన్న అంశం మీద ఆమ్ ఆద్మీ పార్టీ జోనల్ కోఆర్డినేటర్ మహేశ్వర రావు విజయవాడ ప్రెస్ క్లబ్ లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఉపాధిలేక పక్క రాష్ట్రాలకు వలస వెళుతున్న ఉన్న యువతకు ఉపాధి కల్పిస్తూ, రాజకీయాలకు దూరంగా ఉన్న స్వతంత్రంగా ఎదిగిన కొద్దిపాటి వ్యాపార సంస్థలను, కోనేరు సత్యనారాయణ లాంటి విద్యావేత్తలను వేధించే దెబ్బతీస్తాయని అన్నారు.