విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్‌పై శనివారం ఉదయం ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. బస్టాండ్ వద్ద ఆర్టీసీ బస్సులు మలుపు తిరిగే సమయంలో ప్రయాణికులు దిగడం వల్ల బస్సులు అక్కడే ఆగిపోయాయి. దీంతో వెనుకనున్న వాహనాలు కిలోమీటరు మేర నిలిచిపోయి, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి.