విజయవాడ: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

83చూసినవారు
విజయవాడ: రోడ్డు ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
విజయవాడ కృష్ణలంకలోని బాలాజీ హోటల్ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు వివరించారు. రోడ్డు దాటుతుండగా బైక్ ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయసు 35 నుంచి 40 ఏళ్ల మధ్యగా ఉంటుందని, అతని వివరాలు తెలిసిన వారు కృష్ణలంక పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రకటించారు.

సంబంధిత పోస్ట్