గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆరోగ్యం జైల్లో క్షీణించిందని సమాచారం. ఫిబ్రవరి 13 నుంచి రిమాండ్‌లో ఉన్న వంశీ ప్రస్తుతం తీవ్రమైన దగ్గుతో బాధపడుతూ, నడవలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శ్వాసలో ఆటంకం, రాత్రిళ్లు పల్స్ తగ్గుతోంది. ఈ నేపథ్యంలో వైద్యులు నిన్న తన ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. బుధవారం వంశీని చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.