విజయవాడ దుర్గమ్మ గుడిలో జూన్ 26న ప్రారంభమైన వారాహి నవరాత్రులు శుక్రవారం పూర్ణాహుతితో ముగిశాయి. తొమ్మిది రోజుల పాటు వారాహి అమ్మవారిని సప్త మాతృకలలో ఒకరిగా పూజించారు. లోక కల్యాణార్థం పంచవారాహి మంత్రాలతో నవరాత్రులు నిర్వహించామని వైదిక కమిటీ తెలిపింది. ఈ కార్యక్రమంలో ఈవో శీనానాయక్, కోట ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీమాలిక పుస్తకాలను ప్రత్యేక అతిథులకు అందజేశారు.