విజయవాడ బెరమ్ పార్కు వద్ద కృష్ణ నదిలో జరిగిన యోగా ఆన్ వాటర్ క్రాఫ్ట్ కార్యక్రమం వరల్డ్ రికార్డ్ సాధించింది. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశా ఆధ్వర్యంలో 200 వాటర్ క్రాఫ్ట్స్‌పై 1000 మంది పాల్గొన్నారు. కార్యక్రమాన్ని గాలిలో బెలూన్లు వదిలి ప్రారంభించారు. ఎంపీ కేశినేని చిన్ని, ఐఏఎస్ అధికారులు ముఖేష్ కుమార్ మీనా, అజయ్ జైన్, కమిషనర్ ధ్యానచంద్ర హాజరయ్యారు.