అదనపు కట్నం వేధింపులు తాళలేక ఓ మహిళ ఉరేసుకుంది. విజయవాడ వద్ద చుట్టుగుంటకు చెందిన రామావత్ సదా సైదాను ప్రేమ వివాహం చేసుకోగా ఓ కుమారుడు ఉన్నాడు. ఏమైందో తెలియదు కానీ సోమవారం సదా ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కాగా ఇటీవల అదనపు కట్నం కోసం తన కుమార్తెను అల్లుడు వేధిస్తున్నాడని మృతురాలి తండ్రి పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు.