మహిళలకు మరింతగా సామాజిక అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహించాలని మహిళా సాధికారిత కోసం మహిళలు సంఘటితం కావాలని ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర వున్న నాస్తిక కేంద్రంలో అదివారం ప్రారంభమైన 12వ ప్రపంచ నాస్తిక మహాసభలకు ఎంపి కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తో కలిసి హాజరయ్యారు.