స్థానిక విద్యాధరపురం బైపాస్ రోడ్డు వెంబడి సర్వీస్ రోడ్లు, వాకింగ్ ట్రాక్, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేయడం వలన అభివృద్ధి చెందగలదని టిడిపి నాయకులు మైలవరపు కృష్ణ అన్నారు. గురువారం బాలాజీ కాలనీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ బైపాస్ రోడ్డు వెంట అనేక మంది కార్పొరేషన్ కు ఏ విధమైన టాక్స్ లు చెల్లించకుండా అనధికారిక వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, ఫుడ్ కోర్ట్ ఏర్పాటు చేస్తే అభివృద్ధి చెందుతుందని అన్నారు.