కృష్ణలంక రిటైనింగ్ వాల్ దగ్గర డ్రైన్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యాన్ చంద్ర అధికారులను ఆదేశించారు. శుక్రవారం రామలింగేశ్వర నగర్ లో ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించారు. రివర్ ఫ్రంట్ పార్క్ ను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని ఈ సందర్భంగా సూచించారు. రామలింగేశ్వర నగర్ ఎస్ టి పి నిర్మాణం పనులు త్వరగా పూర్తి చేస్తామన్నారు.