నిర్మాణ రంగంలో నిర్మాణాలు నాణ్యంగా కట్టాలంటే నిపుణత సాధించిన భవన నిర్మాణ కార్మికులతో పాటు అవసరమైన సిబ్బంది అవసరమని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్అన్నారు. హైదరాబాద్ మాదాపూర్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ను ఎంపి గురువారం ఏపీ బిల్డింగ్ అదర్ కనస్ట్రక్షన్ వర్కర్స్ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు అధికారులతో కలిసి సందర్శించి ఆ సంస్ద పనితీరును పరిశీలించారు.