అన్న క్యాంటిన్ లు ప్రారంభమైన తరువాత ప్రజల్లో ఆనందం వ్యక్తమౌతుందని విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ అన్నారు. శనివారం విజయవాడ అయ్యపనగర్ లో శనివారం మీడియాతో మాట్లాడుతూ గతంలో వైసీపీ ప్రభుత్వం క్యాంటిన్ లను మూసివేసి దుర్మార్గంగా వ్యవహరించిందని అందుకే ఘోరంగా ప్రజలు ఓడించారన్నారు. అన్న క్యాంటిన్ ల ద్వారా ఎంతోమంది కార్మికులకు తక్కువ ధరకే మంచి భోజనం అందించడం జరుగుతుందన్నారు.