ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కమిషనరేట్ పరిధిలో గల ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ వెనుక ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలను నిర్వహించారు. శనివారం నిర్వహించిన తనిఖీలలో భాగంగా లైసెన్స్ లేకుండా నడిపితే జరిమానా తప్పదని హెచ్చరించారు. బండికి సంబంధించిన పత్రాలు సరిగ్గా లేకపోయినా కూడా చలానా విధించడం జరుగుతుందని తెలిపారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడిపిన వాహనదారులకు చలానా విధించారు.