పర్యాటకులకు మధురానుభూతిని కల్పించేలా కొండపల్లి ఖిల్లా, కొండపల్లి బొమ్మల తయారి కేంద్రాలను అభివృద్ధి చేయడంతో పాటు ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ సంబంధిత అధికారులకు తెలిపారు. కొండపల్లి బొమ్మల తయారీ కాలనీ వద్ద ఎక్స్‌పీరియన్స్ సెంటర్ ఏర్పాటు, కొండపల్లి ఖిల్లా అభివృద్ధి పై గురువారం కలెక్టర్ పర్యాటకుల శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.