గోదావరి, కృష్ణా డెల్టాలను సస్యశ్యామలంగా మార్చిన మహనీయుడు సర్ ఆర్ధర్ కాటన్ దొర అని అవనిగడ్డ ఎమ్మెల్యే తనయుడు మండలి వెంకట్రామ్ అన్నారు. గురువారం సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భంగా మోపిదేవి వార్పు వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాల వేసి మండలి వెంకట్రామ్ నివాళులు అర్పించారు. ఆంధ్రావనిని దక్షిణ భారతానికి అన్నపూర్ణగా మార్చిన వ్యక్తి సర్ ఆర్థర్ కాటన్ అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఉదయ భాస్కర్ పాల్గొన్నారు.