అవయవదానంపై ప్రజల్లో అవగాహన పెరగాలని మంత్రి సత్యకుమార్ అన్నారు. శుక్రవారం విజయవాడలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సాంకేతికంగా అభివృద్ధి చెందుతున్నా ప్రజల్లో మార్పు రాలేదన్నారు. మన రాష్ట్రంలో 260 మంది అవయవ దానం కోసం ముందుకు వచ్చారన్నారు. తెలంగాణలో ఎనిమిది వందల మంది ముందుకు వచ్చారన్నారు. 90 వేల మంది అవయవ దానం కోసం ఎదురు చూస్తున్నారన్నారు.