ఎస్సి వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో మాదిగ హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు మానికొండ శ్రీధర్ ఆధ్వర్యంలో శుక్రవారం తుమ్మలపల్లి కళా క్షేత్రం వద్ద శుక్రవారం అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసారు. ప్రకాశం జిల్లాలో ప్రారంభమైన వర్గీకరణ ఉద్యమం దేశవ్యాప్తంగా ప్రభలమైందన్నారు. నేడు సుప్రీంకోర్టు తీర్పుతో వర్గీకరణ సాధించుకున్నామని, ఎస్సీ వర్గీకరణ మాదిగల చిరకాల కోరికని తెలిపారు.