నేతన్నలకు ఆర్థిక భరోసా కలిగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి సవిత తెలిపారు. ఆప్కో ద్వారా ఆరు నెలలకోసారి దుస్తులుకొనుగోలు చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా విజయవాడలో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఇకపై మూడు నెలలకోసారి దుస్తులు కొనుగోలు చేయనున్నట్లు వెల్లడించారు. నేతన్నలకు బకాయిలను, త్రిఫ్ట్ పథకం కింద కేటాయించిన రూ. 5 కోట్లను కూడా త్వరలోనే విడుదల చేయనున్నట్లు తెలిపారు.