విజయవాడ రామలింగేశ్వర నగర్ లో డ్రైనేజీల సమస్యలపై ఎమ్మెల్యే గద్దే రామ్మోహన్ శుక్రవారం పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ నిర్మాణం చేసిన గత వైసీపీ ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడం వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. 70 అడుగుల రోడ్డు నిర్మాణంను పట్టించుకోకపోవడం వలన నేడు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.