విజయవాడ పాత ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం వాహనాల తనిఖీలలో భాగంగా హెల్మెట్ లేని వాహనదారులకు ట్రాఫిక్ పోలీసులు కౌన్సిలింగ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు రోడ్డుపైకి వస్తే ఆర్య మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపే వారికి , హెల్మెట్ లేకుండా ప్రయాణించే వాహనదారులకు చలానా విధించారు.