రాష్ట్రంలోని యువతకు ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఎఐ), అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం అంతర్జాతీయ స్థాయి ప్రఖ్యాత సంస్థ మైక్రోసాఫ్ట్ తో ఎపి ప్రభుత్వం కీలకమైన ఒప్పందం చేసుకుంది. గురువారం విజయవాడ కార్యాలయంలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో మైక్రోసాఫ్ట్ ప్రతినిధులు, ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ అధికారులు ఎంఓయుపై సంతకాలు చేశారు.