విజయవాడ వెస్ట్ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఇటీవలే లండన్ పర్యటనలో ప్రమాదవశాత్తు జారిపడి కుడి భుజం ఫ్రాక్చర్అయిన విషయం తెలిసిందే. వారు బేగంపేట్ లోని కిమ్స్- సన్ షైన్ ఆసుపత్రిలో చికిత్స పొంది వైద్యుల సూచన మేరకు రెండు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే ఆయనని సీఎం చంద్రబాబు శనివారం వారి ఇంటికి స్వయంగా వెళ్లి పరామర్శించారు. అలాగే పశ్చిమ నియోజకవర్గంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు.