సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ను ఇథియోఫియా దేశానికి చెందిన ప్రతినిధుల బృందం గురువారం సందర్శించింది. ఇథియోఫియా దేశ డిజిటల్ అగ్రికల్చర్ అండ్ ఫైన్సాన్స్ ప్రోగ్రామ్ డైరెక్టర్ గిరుమ్ కెటెమా టెక్లెమారియం నేతృత్వంలో 10 మంది ప్రతినిధుల బృందం అమరావతిలో పర్యటిస్తోంది. డిప్యూటీ సీఈఓ ఎం. మాధురి స్వాగతం పలికారు. ఆర్టీజీఎస్ పనితీరు గురించి ఈ బృందానికి వివరించారు.