విపత్తు ఉపశమనం, సంక్షోభ నిర్వహణలో అగ్నిమాపక సేవల విభాగం ఎల్లప్పుడూ అప్రమత్తతో ఉంటుందని డైరక్టర్ ఆఫ్ ఫైర్ సర్వీస్ డి. మురశీమోహన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల విభాగం ఆధ్వర్యంలో విజయవాడలోని రాష్ట్ర కార్యాలయంలో అగ్నిమాపక సేవా వారోత్సవాల ప్రారంభ వేడుకలు సోమవారం ప్రారంభించారు.