మీడియా రంగంలో నిస్వార్థంగా సేవలందిస్తూ, విలువలతో కూడిన జర్నలిజానికి జీవం పోస్తున్న సీనియర్ జర్నలిస్టు గరికిపాటి వెంకట సాంబశివరావు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ న్యూస్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సంఘ జనరల్ సెక్రెటరీ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం విజయవాడలోని యూనియన్ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర కమిటీ కార్యవర్గ సమావేశంలో బాధ్యతలు స్వీకరించినట్లు గరికిపాటి శివ పేర్కొన్నారు.