విజయవాడలో పెళ్లి పేరుతో ఘరానా మోసం జరిగినా ఘటన శనివారం చోటుచేసుకుంది. కృష్ణలంక పోలీసుల వివరాల మేరకు. కర్ణాటకకు చెందిన దుర్గాప్రసాద్ కు ఆన్లైన్ ద్వారా మధ్య వ్యక్తులు విజయవాడ సంబంధం కుదిర్చారు. పెళ్లి సమయంలో రూ. 4. 50 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేసుకున్నాడు. ఆ మహిళకు గతంలోనే పెళ్లి అయిందని దుర్గాప్రసాద్ తెలుసుకున్నాడు. మధ్య వ్యక్తులు కట్నం డబ్బుతో పరారయ్యారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.