నిర్మల హైస్కూల్ లో మౌళిక సదుపాయలు కల్పించే విషయంలో అభివృద్ది పరంగా సహకారం అందిస్తామని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ తెలిపారు. పటమటలోని నిర్మల హైస్కూల్ లో శుక్రవారం జరిగిన స్పోర్ట్స్ డే సెలబ్రేషన్స్ కి ఎంపి కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఈ సందర్భంగా విద్యార్ధులు ప్రదర్శించిన పలు ప్రదర్శనలు ఆసక్తిగా తిలకించారు.