హేతుబద్దీకరణ ప్రక్రియపై సచివాలయ ఉద్యోగస్తుల సందేహాలను నివృత్తి చేసేందుకు ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 17న వివిధ సచివాలయ ఉద్యోగ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసినట్లు వేల్పుల అర్లయ్య అన్నారు. ఈ సమావేశంలో ఉద్యోగులపై పనిభారం తగ్గించేందుకు సంఘ నాయకులు ఇచ్చిన సహేతుకమైన సూచనలను పరిగణంలోకి తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఏపీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సంక్షేమ సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు వేల్పుల అర్లయ్య సోమవారం కోరారు.