అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని రైతుల వద్ద నుంచిమద్దతు ధర చెల్లించి కొనుగోలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని మంగళవారం విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ సంబంధిత జిల్లా అధికారులకు సూచించారు. వర్షాల కారణంగా పంటలు తీవ్రంగా దెబ్బతిన్న విషయం, మరికొన్ని చోట్ల కల్లాలు, మిల్లులు వద్ద ఉన్న ధాన్యం తడిసిన విషయం తెలుసుకున్న ఎంపీ తక్షణం తడిసిన ధాన్యం కొనుగోలు అంశంపై కలెక్టర్ తో పోన్ లో మాట్లాడారు.