ఈ నెల 5వ తేదీన ఆదివారం విజయవాడ పశ్చి మనియోజకవర్గంలో కె. బి. ఎన్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా మెడికల్ క్యాంప్ ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ అన్నారు. గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో శుక్రవారం ఉచిత మెగా మెడికల్ క్యాంప్ కి సంబంధించిన పోస్టర్ ఎంపి కేశినేని శివనాథ్ ఆవిష్కరించారు.