ట్రైబల్ విజన్ -2025 క్యాలెండర్ ను విజయవాడ ఎంపి కేశినేని శివనాథ్ శుక్రవారం గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో ఆవిష్కరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజన సంక్షేమం, అభివృద్ది ద్యేయంగా పనిచేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు సొంగాసంజయ్ వర్మ, టిడిపి రాష్ట్ర నాయకులు మాదిగాని గురునాథం పాల్గొన్నారు.