రాజకీయ కక్ష్యతో కుటుంబాలను రోడ్డు మీదకు లాగవద్దని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి భారతి రెడ్డి మీద సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలపై షర్మిల స్పందించారు. సోషల్ మీడియాలో భారతి రెడ్డిపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరమని చెప్పారు. శుక్రవారం విజయవాడలోని కాంగ్రెస్ కార్యాలయంలో షర్మిల మీడియాతో మాట్లాడారు.