అసంఘటిత రంగ కార్మికులకు ఈ -శ్రమ యాప్ ద్వారా ఉచిత నమోదు కార్యక్రమాన్ని బుధవారం ఉదయం బెంజిసర్కిల్ సిగ్నల్ వద్ద ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్‌టీఆర్ జిల్లా విజయవాడ సహాయ కార్మిక అధికారి బత్తుల కిషోర్‌కుమార్ మంగళవారం తెలిపారు. ఉచిత నమోదు ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి వచ్చే పథకాలతో పాటు సామాజిక భద్రత ఉంటుందన్నారు.