ముఖ్యమంత్రి ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన అన్నా క్యాంటీన్లలో మెనూ కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకోవడం జరిగిందని, అదే విధంగా నిర్వహణపరంగా ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా నిరంతర పర్యవేక్షణ ఉంటోందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీషా తెలిపారు. గురువారం రాత్రి విజయవాడ అర్బన్, వన్‌టౌన్ గాంధీ మహిళా కళాశాల వద్ద అన్నా క్యాంటీన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.