రాష్ట్రంలో వచ్చే నెలాఖరిలోగా 3లక్షల గృహానిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు రాష్ట్ర గృహనిర్మాణ మంత్రి కొలుసు పార్ధసారధి వెల్లడించారు. ఈ మేరకు బుధవారం విజయవాడ కార్యాలయంలో మాట్లాడుతూ.. 2019-24 మధ్య కాలంలో రాష్ట్రానికి మొత్తం18. 04 లక్షల గృహాలు మంజూరైతే గత ప్రభుత్వం కేవలం 5. 87 లక్షల గృహాలను మాత్రమే పూర్తి చేసి12. 20లక్షల గృహ అసంపూర్తిగా విడిచిపెట్టేసిందని పేర్కొన్నారు.