తరాలకు వారధులుగా. భవిష్యత్తుకు నిర్మాతలుగా ఉన్న వయోవృద్ధులకు ఆత్మీయతను పంచి సమాజంలో గౌరవంగా జీవించేలా ప్రతిఒక్కరూ సహానుభూతితో వ్యవహరించాలని, నైతిక విలువల పరంపర కొనసాగేలా చూడాల్సిన అవసరముందని జిల్లా కలెక్టర్ డా. జి. లక్ష్మీశ అన్నారు. ప్రపంచ వృద్ధుల వేధింపుల నివారణ అవగాహన దినం సందర్భంగా ఆదివారం కలెక్టరేట్ జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ లక్ష్మీశ పాల్గొన్నారు.