జిల్లాలో పీ-4 సర్వే ఆధారంగా గుర్తించిన ప్రతి బంగారు కుటుంబానికీ ఆర్థిక, సామాజిక అభివృద్ధి ప్రణాళిక రూపకల్పనకు కృషిచేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. లక్ష్మీశ వివరించారు. బంగారు కుటుంబాల నుంచి సమాచారాన్ని సేకరించడంలో జిల్లా స్థాయి అధికారులు, క్షేత్రస్థాయి అధికారులతో పటిష్ట సమన్వయంతో పనిచేయాలన్నారు. మంగళవారం ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.