. విజయవాడ: ట్రాక్టర్ ట్రాలీతో యువకుల హల్ చల్

77చూసినవారు
. విజయవాడ: ట్రాక్టర్ ట్రాలీతో యువకుల హల్ చల్
నున్న గ్రామంలో సోమవారం ట్రాక్టర్ ట్రాలీ బీభత్సం సృష్టించింది. విజయవాడ నగర శివారు నున్న  గ్రామంలో ట్రాక్టర్ ట్రాలీ బీభత్సంతో స్థానికులు ఆందోళనకు గురయ్యారు. మద్యం మత్తులో ట్రాక్టర్ పై ముగ్గురు వ్యక్తుల హల్చల్ చేశారని స్థానికులు వివరించారు. అంతటితో ఆగకుండా ట్రాక్టర్ పై అతివేగంగా వెళ్తూ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టినట్లు స్థానికులు వివరించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్