అరసవల్లిలో కనుల పండువగా క్షీరాభిషేకం ప్రారంభం

62చూసినవారు
AP: శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యనారాయణస్వామి దేవాలయంలో సోమవారం అర్ధరాత్రి నుంచే రథసప్తమి వేడుకలు ప్రారంభమయ్యాయి. ప్రధాన అర్చకులు ఇప్పటి శంకరశర్మ, నగేష్‌శర్మ నిర్వహణలో అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ క్షీరాభిషేకం కనుల పండువగా నిర్వహించారు. దేవాదాయ శాఖ ప్రిన్సిపాల్ సెక్రెటరీ వినయ్ చంద్ ప్రభుత్వ లాంచనాలతో పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్, ఎమ్మెల్యేలు స్వామిని దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్