మహా కుంభమేళాలో ఇటీవల జరిగిన తొక్కిసలాట ఘటన అంత పెద్దదేమీ కాదని బీజేపీ ఎంపీ, నటి హేమామాలిని అన్నారు. ఈ తొక్కిసలాటలో మృతుల సంఖ్యను ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం దాచిపెడుతోందని సమాజ్‌వాది పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ చేసిన ఆరోపణలపై ఆమె స్పందించారు. ఈ ఘటన అంత పెద్దదేమీ కాదని, దాన్ని పెద్దదిగా చేసి చూపుతున్నారని వ్యాఖ్యానించారు. ఈ ఘటనను రాజకీయం చేయడం సబబు కాదని పేర్కొన్నారు.