ఆదోని పట్టణంలోని వేదారిగేరి వద్ద రైల్వే అండర్ పాస్ నిర్మించాలి అని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి అభిప్రాయపడ్డారు. ఈ సమస్యను ఆయన మంగళవారం ఎస్సీఆర్ జీఎంకు వివరించి వినతిపత్రం అందజేశారు. మార్కెట్ యార్డుకు వెళ్ళే హమాలీలు, రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గమనించిన ఎమ్మెల్యే, ఆదోని మీదుగా రాయచూరు-కాచిగూడ రైలును పొడిగించాలని కోరారు. జీఎం దీనికి సానుకూలంగా స్పందించినట్లు ఆయన వెల్లడించారు.