ఆదోని పట్టణంలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని మంగళవారం ఎమ్మెల్యే పార్థసారథి ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తున్న విజన్ 2047 కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడం లక్ష్యమని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్, సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, రజక కార్పోరేషన్ చైర్‌పర్సన్ సావిత్రి, కమిషనర్ కృష్ణ, ఎంపీడీఓ రాజేంద్రప్రసాద్ పాల్గొన్నారు.