ఆదోనిలో పత్తి ధరలో స్వల్ప వృద్ధి
By W. Abdul 70చూసినవారుఆదోని వ్యవసాయ మార్కెట్‌లో బుధవారం పత్తి క్వింటా గరిష్ట ధర రూ. 7, 659 పలికింది. మంగళవారంతో పోలిస్తే రూ. 30 పెరగడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో క్వింటా పత్తి కనిష్ట ధర రూ. 3, 566, వేరుశనగ గరిష్ట ధర రూ. 6, 939, కనిష్ట ధర రూ. 3, 566 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. పంట ఉత్పత్తులను మార్కెట్ సరైన సమయంలో తీసుకొచ్చి అధికారులకు సహకరించాలని కోరారు.