ఆళ్లగడ ప్రముఖ పుణ్యక్షేత్రమైన అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి పార్వేట ఉత్సవాలు ఈనెల 15వ తేదీ నుండి ప్రారంభమవుతాయని ఆలయ ప్రధాన అర్చకులు కిడాంబి వేణుగోపాల్ స్వామి శనివారం మీడియా ముఖంగా తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 33 రోజులపాటు ఏకధాటిగా 45 గ్రామాలలో జ్వాలా నరసింహస్వామి, ప్రహ్లాద వరద స్వామి వారు పారువేటకు బయలుదేరుతారని తెలిపారు.