ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి పట్టణంలో శ్రీ శ్రీ కట్టమీది దస్తగిరి స్వామి వార్ల ఊరుసు మహోత్సవం ఆదివారం వైభవంగా నిర్వహించబడింది. ఈ మహోత్సవంలో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పాల్గొని దస్తగిరి స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎద్దుల బండలాగుడు పోటీలను ప్రారంభించి భక్తులతో కలిసి ఉత్సాహంగా కార్యక్రమంలో పాల్గొన్నారు.